మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా యువ దర్శకుడు హనీఫ్ అదేని దర్శకత్వంలో తరకెక్కిన లేటెస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మార్కో. గత ఏడాది డిసెంబర్ లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ భారీగా విజయవంతం అయి ఓవరాల్ గా రూ. 100 కోట్లకు పై గ్రాస్ ని సొంతం చేసుకుంది.
ఇక ఈ మూవీ తెలుగులో డబ్ కాబడి ఇక్కడి ఆడియన్స్ ని కూడా అలరించింది. ముఖ్యంగా ఉన్ని ముకుందన్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో పాటు యాక్షన్ సీన్స్, దర్శకుడు అదేని టేకింగ్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఆడియన్స్ ని అలరించాయి. ఇక ఈ మూవీని క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థపై అత్యంత ప్రతిష్టాత్మకంగా షరీఫ్ మొహమ్మద్ నిర్మించారు.
ఇటీవల థియేటర్స్ లో అదరగొట్టిన మార్కో మూవీ లేటెస్ట్ గా ప్రముఖ ఓటిటి మధ్యమం సోనీ లివ్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. అయితే విషయం ఏమిటంటే ఈ మూవీ ఫిబ్రవరి 21 నుంచి మరొక తెలుగు ఓటింగ్ మాధ్యమం ఆహాలో కూడా ప్రసారం కానుంది. అయితే ఆహాలో ఈ మూవీ తెలుగు వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది.