Homeసినిమా వార్తలుMarco Ready for OTT Streaming ఓటిటి లో స్ట్రీమింగ్ కి రెడీ అయిన 'మార్కో'

Marco Ready for OTT Streaming ఓటిటి లో స్ట్రీమింగ్ కి రెడీ అయిన ‘మార్కో’

- Advertisement -

మలయాళ యువ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మార్కో. ఈ మూవీ క్యూబ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై షరీఫ్ మహమ్మద్ నిర్మాణంలో గ్రాండ్ గా నిర్మితం కాగా హానీఫ్ అదేనీ దీనికి దర్శకత్వం వహించారు. 

ఇక రిలీజ్ అనంతరం మార్కో మూవీ రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ముకుందన్ కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ గా నిలిచి ఇతర  భాషల్లో కూడా ఆయనకు మంచి క్రేజ్ ని తీసుకువచ్చింది. ఇక ఈ మూవీలో సిద్ధిఖ్, జగదీష్, అభిమన్యు తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సోన్ పౌల్లు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

మొత్తంగా రూ. 30 కోట్ల వ్యయంతో రూపొందిన మార్కో మూవీకి కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా చంద్రు సెల్వరాజ్ ఫోటోగ్రఫి అందించారు. విషయం ఏమిటంటే, మార్కో మూవీ లవర్స్ డే సందర్భంగా నేటి అర్ధరాత్రి నుండి తమ ఓటిటి ప్లాట్ ఫామ్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్ కానున్నట్లు ప్రముఖ ఓటిటి మాధ్యమం సోని లివ్ వారు నేడు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు. మరి థియేటర్స్ లో అదరగొట్టిన ఈ మూవీ ఎంతమేర ఓటిటి ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి. 

READ  ​Ram Charan Mythological Movie with Bollywood Director బాలీవుడ్ డైరెక్టర్ తో  రామ్ చరణ్ భారీ మైథలాజికల్ మూవీ ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories