పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో తాజాగా ఒక సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. వీరిద్దరూ హీరోలుగా నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళంలో ఆయన నటించి దర్శకత్వం వహించిన ‘వినోదయ సీతం’కు తెలుగులో రీమేక్ గా తెరకెక్కనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
వినోదయ సీతం తమిళ వెర్షన్ కొన్ని చోట్ల కామెడీ కలిగి ఉన్న ఒక సీరియస్ సినిమా. కాగా అందులో స్టార్ హీరో సినిమాలకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. అందువల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ కు తగ్గట్టుగా తమిళ వెర్షన్ నుంచి తెలుగులో పలు మార్పులు చేసేందుకు సముద్రఖని, త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
అలాగే స్క్రిప్ట్ లో మరిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాను తెలుగు ప్రేక్షకులకు మరింత సరిపోయేలా తీర్చిదిద్దే పనిలో పడ్డారట. ఇన్ని మార్పులతో ఈ సినిమాను ఒక ఆర్ట్ సినిమాలా కాకుండా పక్కా కమర్షియల్ సినిమాగా మలబోతున్నారని అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు కూడా ఇలానే మార్పులతో కూడిన రీమేక్ లు గా తెరకెక్కాయి.
పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్.. ఆయన సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రోహిణి, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాశ్ వారియర్, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా ఈ సినిమాకి స్క్రీన్ అందించనున్న త్రివిక్రమ్, పైన చెప్పినట్టుగా ఈ సినిమాలోని ఒరిజినల్ వెర్షన్ నుంచి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పలు మార్పులు ఉండేలా చూసుకుంటారని సమాచారం. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ ల ఈ క్రేజీ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాతో 2015లో వచ్చిన గోపాల గోపాల సినిమా తర్వాత పవర్ స్టార్ రెండో సారి ‘దేవుడు’ పాత్రలో నటిస్తున్నారు.