Homeసినిమా వార్తలునేనున్నాను నిఖిల్ అంటున్న మంచు విష్ణు

నేనున్నాను నిఖిల్ అంటున్న మంచు విష్ణు

- Advertisement -

యువ హీరో, నటుడిగా చక్కని పేరు తెచ్చుకున్న నిఖిల్ తాజాగా నటిస్తున్న ప్యాన్ ఇండియా సినిమా ‘కార్తికేయ 2’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు. అభిషేక్ అగర్వాల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లపై అభిషేక్ అగర్వాల్ టీజి. విశ్వప్రసాద్ నిర్మించారు. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఆగస్టు 12న భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా హీరో నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ ని వాయిదా వేయమని బెదిరించారని, అంతే కాకుండా ఇప్పట్లో నీ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదని, అక్టోబర్ లేదా నవంబర్ కు పోస్ట్ పోన్ చేసుకోమన్నారు అని.. అలాంటి మాటలు విన్నాక భావోద్వేగానికి గురై ఒక దశలో ఏడ్చేశానని నిఖిల్ వెల్లడించడం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు నిఖిల్ ని అంతగా బెదిరించింది ఎవరు? .. ఎందుకు తన సినిమానే టార్గెట్ చేస్తున్నారు అన్న ప్రశ్నలు మరియు చర్చలు ఇండస్ట్రీ వర్గాల్లో చెలరేగాయి. నిఖిల్ భావోద్వేగానికి లోనైన తీరుకు చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో అతనికి మద్దతుగా నిలుస్తూ పోస్ట్ లు కూడా వేశారు.

READ  మళ్ళీ మొదలు కానున్న భారతీయుడు 2 షూటింగ్

ఇదిలా ఉండగా ఈ సందర్భంలో హీరో మంచు విష్ణు నిఖిల్ కు అండగా నిలిచారు. తమ్ముడూ నీకు నేనున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ‘ధైర్యంగా వుండు. కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుంది. దాన్ని అందరూ ఒప్పుకుంటారు’ అని ట్వీట్ చేశారు.

https://twitter.com/actor_Nikhil/status/1554351618379788289?t=wL6rWrJeJzB26OOZHIODZA&s=19

మంచు విష్ణు ట్వీట్ కు నిఖిల్ రిప్లై ఇచ్చారు. ‘విష్ణు భయ్యా నీ మాటలు మా టీమ్ కు కొండంత అండను ఇస్తున్నాయి’ అన్నాడు. అయితే ఈ విషయంలో మంచు విష్ణుని నెటిజన్ లు దొరికిందే అవకాశంగా భావించి ట్రోల్ చేస్తున్నారు.

ముందు నీకే సరైన దిక్కు లేదు మళ్ళీ నువ్వు వెరేవాళ్ళని ఆదుకుంటావా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మంచు కుటుంబానికి సోషల్ మీడియాలో ట్రాల్ అవడం కొత్తేమీ కాదు. మోహన్ బాబు, లక్ష్మి ప్రసన్న, విష్ణు అందరూ ఏదో ఒక కారణం చేత గతం లోనూ ట్రాల్ అయ్యారు. ఇప్పుడూ అవుతున్నారు.

ఇక మంచు విష్ణు ప్రస్తుతం ‘జిన్నా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ కి సంబంధించిన వివాదంలో ఇటీవలే ఈ సినిమా వార్తల్లో నిలిచింది. పాయల్ రాజ్పుత్ మరియు సన్నీలియోన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

READ  లాల్ సింగ్ చద్దా కోసం మెగాస్టార్ స్పెషల్ షో

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories