Homeసినిమా వార్తలుమెగాస్టార్ తో తలపడనున్న మంచు విష్ణు

మెగాస్టార్ తో తలపడనున్న మంచు విష్ణు

- Advertisement -

మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయం సాధించి చాలా కాలం అయింది. అయితే బాక్స్ ఆఫీసు వద్ద గట్టి హిట్ కోసం విష్ణు కష్టపడుతూనే ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మధ్యలో కొన్ని ప్రయోగాలు చేసినప్పటికీ అవి పెద్దగా సత్ఫలితాలు అందించలేదు. ఇక ప్రస్తుతం అయన పూర్తి దృష్టి జిన్నా అనే సినిమా పైనే ఉంది. మాస్ కమర్షియల్ కామెడీ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ సినిమా పై మంచి విష్ణు గట్టి నమ్మకమే పెట్టుకున్నట్లు అర్థమవుతుంది.

ఇక ఈ సినిమాను విష్ణు తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ మళయాళం మరియు హిందీలో విడుదల చేయనున్నట్లు కొన్ని పోస్టర్లతో బాగానే అసక్తి ఏర్పడేలా చేశారు. ఈ సినిమాలో మేయిన్ హీరోయిన్ గా పాయల్ రాజ్ పూత్ నటిస్తుండగా సన్నీ లియోన్ మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఇటీవల విడుదల చేసారు.

ఇదే క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నారు. ఇక విడుదల తేదీ విషయంలో కూడా తాజాగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారట.

READ  ధనుష్ "సార్" ఫస్ట్ లుక్

అయితే అదే దసరా సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా, అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా విడుదల కాబోతున్నాయి. అంతే కాకుండా అదే వారంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “పొన్నియన్ సెల్వన్” సినిమా కూడా విడుదల అవుతుంది. ఈ క్రమంలో మంచు విష్ణు పెద్ద చిత్రాలతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు అంటే సినిమా మీద ఎంత నమ్మకంతో ఉన్నారో అర్థం అవుతుంది.

దసరా పండుగ సందర్భంగా సినిమాని విడుదల చేస్తే సెలవుల వల్ల లాభం పొందే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎలాంటి సినిమా విడుదలైనా, మంచి కలెక్షన్స్ వస్తాయి అని ఆ సమయంలో సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. అదే తరహాలో ఆలోచించి మంచు వారసుడు విష్ణు, అక్కినేని నాగార్జున మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర హీరోల సినిమాలకి పోటీగా తన సినిమాని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

READ  కష్టాల్లో థియేటర్లు: ఆంధ్ర ప్రదేశ్ లో 400 థియేటర్ల మూసివేత

గతంలో మంచు విష్ణు హీరోగా నటించిన కామెడీ సినిమా “దేనికైనా రెడీ” దసరా పండుగ సందర్భంగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఆ సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అయి జిన్నా సినిమా విజయం సాధిస్తుందో.. లేక పెద్ద సినిమాల మధ్య ఇమడలేక పోతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories