Homeసినిమా వార్తలుమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొత్త నిభందనలు ప్రవేశ పెట్టిన మా అధ్యక్షుడు మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొత్త నిభందనలు ప్రవేశ పెట్టిన మా అధ్యక్షుడు మంచు విష్ణు

- Advertisement -

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)లో నటుడు ప్రకాష్ రాజ్‌ని ఓడించి మంచు విష్ణు అధ్యక్షుడయిన సంగతి తెలిసిందే. ఎన్నికలు గెలిచిన ఏడాది తరువాత అక్టోబర్ 13, గురువారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో మంచు విష్ణు మీడియాతో సమావేశమయ్యారు.

ఈ క్రమంలో ఇప్పటివరకు కొత్త ప్యానెల్ సాధించిన విజయాలను మరియు అసోసియేషన్ యొక్క ప్రస్తుత నిబంధనలకు చేసిన కొన్ని సవరణలను ఆయన తెలియజేశారు. ఎన్నికల సమయంలో విష్ణు చేసిన అతి పెద్ద వాగ్దానం ఏమిటంటే, తన ఖర్చుతో MAA కోసం భవనాన్ని నిర్మిస్తానని. అయితే, అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. గురువారం మీడియా ప్రతినిధులతో విష్ణు మాట్లాడుతూ.. MAA అసోసియేషన్ కు భవనం రావడానికి మరో మూడేళ్లు పడుతుందని చెప్పారు.

అసోసియేషన్‌కు చెందిన 200 మంది సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో విష్ణు మాట్లాడుతూ.. ఈ విషయంలో రెండు ఆప్షన్లు చర్చించామని తెలిపారు. ఒకటి ఫిల్మ్ నగర్ నుండి 20 నుండి 30 నిమిషాల దూరంలో ఒక బిల్డింగ్ కొనడం. తాను భవనాన్ని చూశానని, వచ్చే ఆరు నెలల్లో దీనిని సిద్ధం చేయవచ్చని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఉన్న ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మిస్తామని విష్ణు తెలిపారు.

READ  బ్రహ్మస్త్ర - ఓకే ఒక జీవితం సినిమాలకు గణేష్ నిమర్జనం వల్ల ఇబ్బంది కలిగిస్తుందా?

కొత్త ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్‌లో ఆఫీస్ స్పేస్ ఉండడం రెండో ఆప్షన్ అందరికీ సౌకర్యంగా ఉంటుందని, రెండో ఆప్షన్‌ను సభ్యులందరూ ఎంచుకున్నారని విష్ణు పేర్కొన్నారు. కాబట్టి, ఆయన ప్రకారం మూడు సంవత్సరాలలో MAA స్వంత కార్యాలయాన్ని సంపాదించుకుంటుంది. అలాగే అప్పటి వరకు MAA ఆఫీస్ స్పేస్ ఖర్చులు తానే భరిస్తానని విష్ణు చెప్పారు.

ఇక ఇదే క్రమంలో మంచు విష్ణు MAAలో సభ్యత్వం పొందేందుకు సంబంధించిన మార్గదర్శకాలకు అనేక మార్పులను కూడా తెలిపారు. “కొత్త నిబంధనల ప్రకారం, ఒక నటుడు MAAలో జీవితకాల సభ్యునిగా ఉండాలంటే ఆ నటుడు నటించిన రెండు సినిమాలు కనీసం థియేటర్లలో లేదా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల అయి ఉండాలి. అలాగే, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ జీవిత సభ్యత్వం పొందాలంటే, వారు కనీసం 10 సినిమాల్లో ఉండాలి, ప్రతి సినిమాలో కనీసం ఐదు నిమిషాల స్క్రీన్ స్పేస్ మరియు డైలాగ్‌లు కనీసం రెండు నిమిషాలు ఉండాలి ”అని విష్ణు చెప్పారు.

ఇతర సభ్యులు ‘అసోసియేట్ మెంబర్‌షిప్’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది గతంలో ‘తాత్కాలిక సభ్యత్వం’గా ఉండేది. అంతే కాకుండా, కనీసం ఐదేళ్ల పాటు జీవితకాల సభ్యత్వం ఉన్నవారు మాత్రమే భవిష్యత్తులో MAA ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదా ఓటు వేయడానికి అర్హులని ఆయన తెలిపారు.

ఇంకా, ఇతర చిత్ర పరిశ్రమల నుండి తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చే నటులు కూడా ఇలా వచ్చి అలా నటించలేరని, వారు కూడా MAA సభ్యత్వం తీసుకోవాలని విష్ణు అన్నారు. అసోసియేషన్ యొక్క చట్టాలను నటీనటులందరికీ మరింత సౌలభ్యంగా ఉండేలా ఈ మార్గదర్శకాలను మార్చినట్లు MAA ప్రెసిడెంట్ మంచు విష్ణు చెప్పారు.

READ  100 కోట్ల క్లబ్ లో చేరిన ధనుష్ తిరుచిత్రంబళం

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories