మంచు మనోజ్ రెండో పెళ్లి వార్త మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మంచు మోహన్ బాబు తనయుడు మనోజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో వివాహం మనోజ్ జరగనుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరి రెండో పెళ్లి వార్త మరోసారి వైరల్‌గా మారింది.
మంచు మనోజ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొన్ని రోజులుగా సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్న మంచు మనోజ్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రణతి అనే యువతిని పెళ్లాడిన మనోజ్ పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. ప్రణతితో విడిపోయారు. అభిప్రాయ కారణంగా ఈ ఇద్దరి మధ్య సంబంధాలు ఎక్కువ కాలం నిలవలేదు.
పెళ్లి తర్వాత ప్రణతి అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం చేసిన సంగతి తెలిసిందే. మనోజ్, ప్రణతి మధ్య విభేదాలకు ఇదే ప్రధాన కారణమని వినికిడి. ఆ సమయంలో మనోజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే మంచు మనోజ్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఇప్పుడు జోరుగా ప్రచారంలోకి వచ్చింది.
మంచు మనోజ్ రాయలసీమకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారట. మనోజ్ మరియు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనికతో కలిసి దిగిన ఫోటోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మనోజ్ మౌనిక ల పెళ్లి వచ్చే ఏడాది అంటే 2023 ఫిబ్రవరి 2న జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ పెళ్లి గురించి మనోజ్ స్వయంగా స్పందిస్తేనే మొత్తం విషయం మీద క్లారిటీ వస్తుంది.