కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో ఇటీవల జరిగిన గొడవల వివాదం ప్రస్తుతం తారా స్థాయికి చేరింది. ముఖ్యంగా ఆయన కుమారుడు మంచు మనోజ్ కి అలానే మోహన్ బాబుకి మధ్య పెద్ద గొడవ జరుగడంతో ఇది ప్రారంభం అయింది. ఇక నిన్న దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్న మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ఈ వివాదాన్ని సర్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా తండ్రి తనయుల మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారట. కాగా నేడు ఈ వివాదం పై మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ, నిజానికి తనకు తండ్రి పై గౌరవం ఉందని, అయితే తమ పై ఆయన చేసిన ఆరోపణల పై ఆవేదన వ్యక్తం చేసారు మనోజ్.
గొడ్డు లాగా లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ సంస్థ లో పలు సినిమాలకు పని చేసానని, అయితే దానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఎమోషనల్ గా ఆవేదన వ్యక్తం చేసారు. నిజానికి తాను ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుతోంది, అలానే పోరాడుతోంది ఆస్థి కోసం కాదు తన భార్య, కుమార్తె కోసం అని అన్నారు. కాగా ఈ వివాదం గురించిన పూర్తి వివరాలు సాయంత్రం ప్రెస్ మీట్ ద్వారా వెల్లడిస్తానని అన్నారు మనోజ్ మొత్తంగా రోజు రోజుకు ఎన్నో మలుపులు తిరుగుతున్న వీరి కుటుంబ వివాదం ఎప్పటికి పూర్తిగా సర్దుమనుగుతుందో చూడాలి.