ప్రస్తుతం యువతలో మంచి క్రేజ్ కలిగిన యువ హీరోయిన్స్ లో మమిత బైజు కూడా ఒకరు. ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న మూవీ ప్రేమలు. ఈ మూవీ తెలుగులో కూడా హిట్ అయింది. యూత్ఫుల్ లవ్ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే.
ఇక ఈ మూవీలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు మమిత. అనంతరం ఆమెకు ప్రస్తుతం వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రధానంగా తమిళ్ లో ఇప్పటికే విష్ణు విశాల్ తో ఒక సినిమాలో ఆమెనే లీడ్ హీరోయిన్. అలానే కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇలయదళపతి విజయ్ హీరోగా హెచ్ వినోద్ తీస్తున్న సినిమా జన నాయగన్ లో ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది మమిత.
అలానే తాజాగా ప్రదీప్ రంగనాథన్ తదుపరి సినిమాలో కూడా లీడ్ హీరోయిన్ గా ఆమె ఎంపికైంది. అయితే వాటితో పాటు ధనుష్ – విఘ్నేష్ రాజా కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాతో పాటు సూర్య – వెంకీ అట్లూరి సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా ఆమెకు అవకాశం వచ్చింది. మరోవైపు వీటితో పాటు ఇప్పటికే ప్రేమలు 2 కూడా ఆమె చేస్తోన్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా మోలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న న్యూస్ ప్రకారం ఈ వరుస క్రేజీ సినిమాలతో హీరోయిన్ గా మమిత మరింత ఉన్నత స్థాయికి చేరడం ఖాయం అంటున్నారు. మొత్తంగా నటిగా మమిత బైజు ఈ మూవీస్ తో ఎంత మేర సక్సెస్ లని తన ఖాతాలో వేసుకుంటారో చూడాలి.