యువ నటుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ది ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఫ్లాప్ గా నిలిచింది. అనంతరం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతోన్న లేటెస్ట్ VD 12 వర్కింగ్ టైటిల్ మూవీ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.
దీనిని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ పవర్ఫుల్ రోల్ చేస్తున్న ఈ మూవీ నుండి తాజాగా ఒక పిక్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే తాజాగా దాని పై మేకర్స్ స్పందించారు.
ఇప్పటివరకు మూవీ 60% షూటింగ్ జరుపుకుందని, ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న షెడ్యూల్ నుండి లీక్ అయిన పిక్ ని ఎవరూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు, అతి త్వరలో అఫీషియల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని వారు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ఒక నోట్ ద్వారా తెలిపారు. మరి ఇకనుండి అయినా ఇటువంటి లీక్స్ జరుగకుండా ఉండాలని కోరుకుందాం.