పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తాజాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ మూవీ పుష్ప 2 ది రూల్. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ పై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ఆడియన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ఫహాద్ ఫాసిల్, సునీల్, అనసూయ, రావు రమేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు నటిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్న పుష్ప 2 నుండి ఇటీవల రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన రెండు సాంగ్స్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి. ఇక తమ మూవీని డిసెంబర్ 6న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.
అయితే కొన్ని కారణాల వలన పుష్ప 2 షూటింగ్ నిలిచిపోయిందని, అలానే మూవీ కూడా వచ్చే ఏడాది సమ్మర్ కి వాయిదా పడిందని రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. కాగా వాటన్నిటికీ చెక్ పెడుతూ కొద్దిసేపటి క్రితం పుష్ప టీమ్ అఫీషియల్ రిలీజ్ డేట్ లో ఏమాత్రం మార్పు లేదని తమ ట్విట్టర్ ప్రొఫైల్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. IMDB మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో పుష్ప 2 టాప్ లో నిలవడంతో వారి ట్వీట్ ని కోట్ చేస్తూ పుష్ప టీమ్ రిలీజ్ డేట్ పై క్లారిఫై చేయడం జరిగింది.