ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరిర్ పరంగా వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ది రాజా సాబ్, హను రాఘవపూడి సినిమాలు రెండు కూడా సెట్స్ మీద ఉండగా అతి త్వరలో సందీప్ రెడ్డివంగా తీయనున్న స్పిరిట్ కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా బిజీ బిజీగా కొనసాగుతున్నారు. తాజాగా హరిహరవీరమల్లు యొక్క సెట్స్ లో ఎంజాయ్ అయ్యారు పవన్. చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది.
దీని తనంతరం అతి త్వరలో సుజీత్ తీస్తున్న ఓజి మూవీ బ్యాలెన్స్ షూట్ లో పాల్గొంటున్నారు. ఆ మూవీ కూడా ఆల్మోస్ట్ 80 శాతానికి పైగా షూట్ పూర్తిచేసుకుంది. అయితే విషయం ఏమిటంటే డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్న మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి లో ప్రభాస్ ఒక సర్ప్రైసింగ్ క్యామియో పాత్రలో కనిపించరున్నారనే న్యూస్ రెండు రోజులుగా మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
అయితే దానిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అది ఏమాత్రం వాస్తవం కాదని నిజానికి ప్రభాస్ గారు ప్రస్తుతం కెరిర్ పరంగా బిజీగా ఉన్నారని ఇటు పవన్ కళ్యాణ్ కూడా త్వరలో ఓజి సెట్స్ లో జాయిన్ అవుతారని వారు తెలిపారు. ఇటువంటి రూమర్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉండటంతో మరింతగా అందరిలో ఓజి మూవీ పై క్రేజ్ పెంచుతోంది. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.