Homeసినిమా వార్తలుదర్శకుడు వంశీ పైడిపల్లి పై మండి పడుతున్న మహేష్ అభిమానులు

దర్శకుడు వంశీ పైడిపల్లి పై మండి పడుతున్న మహేష్ అభిమానులు

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు దర్శకుడు వంశీ పైడిపల్లి పై సోషల్ మీడియాలో ఆగ్రహానికి గురవుతున్నారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘వారిసు’ రెండో సింగిల్ విడుదలైన సందర్భంలో వంశీ పైడిపల్లి పై మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2019లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నప్పటికీ, మహేష్ అభిమానులు ఈ చిత్రం పట్ల అస్సలు సంతోషించలేదు ఎందుకంటే ఈ చిత్రం మహేష్ బాబు యొక్క మునుపటి చిత్రాలను కలిపి ఒక నాసిరకమైన మిశ్రమం లాగా ఉందని వారు భావించారు. కాగా ఈ చిత్రం యొక్క విజయానికి మహేష్ బాబు సూపర్ స్టార్ డమ్ మాత్రమే కారణమని వారి వాదన.

ఇక మహర్షి సినిమాలో కంటెంట్ తోనే కాకుండా ప్రెజెంటేషన్ విషయంలోనూ మహేష్ అభిమానులు నిరాశ చెందారు. మహర్షి మహేష్ కెరీర్ లో 25వ సినిమా కావడం విశేషం. కాబట్టి, అభిమానులు సినిమా టైటిల్ కార్డుకు ఒక ప్రత్యేకమైన ట్రీట్ మెంట్ ఆశించడం సహజం. ఎందుకంటే ఇది తమ అభిమాన హీరో కెరీర్ లో ఒక మైలురాయి సినిమా కాబట్టి ఆ మాత్రం ఆశ ఉండటం తప్పు కూడా కాదు.

READ  Thalapathy67: రజినీకాంత్ మ్యాజిక్ ను విజయ్ రిపీట్ చేయగలడా?

కానీ మహర్షిలో మహేష్ టైటిల్ కార్డు కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్లానింగ్ చేయకుండా దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ అభిమానులను నిరాశపరిచారు. మహేష్ 25వ సినిమా అనే విషయాన్ని చాలా సింపుల్ గా చూపించడమే కాకుండా, 25వ టైటిల్ కార్డు వచ్చేటపుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా దారుణంగా ఉండటంతో ఆ మాత్రం కూడా చూసుకొలేరా అని మహేష్ అభిమానులు ఆవేశానికి లోనయ్యారు.

ఇప్పుడు అదే దర్శకుడు వారిసు చిత్రానికి దళపతి విజయ్ కు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సంక్రాంతి/ పొంగల్ కు ఈ చిత్రం విడుదల కానుంది మరియు ఈ సినిమాకి సంబందించిన రెండవ పాటను ఈ రోజు విడుదల చేశారు (Thee Thalapathy). విజయ్ అభిమానులు ఈ పాటతో సంబరాలు చేసుకుంటున్నారు.

ఇది సూపర్ స్టార్ మహేష్ అభిమానులను అసంతృప్తికి గురిచేస్తోంది మరియు వంశీ పైడిపల్లి విజయ్ కు ఇచ్చినంత ప్రాధాన్యత మహేష్ బాబు కు ఇవ్వకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  JRC, N కన్వెన్షన్స్‌లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ.. భావోద్వేగానికి గురైన మహేష్ బాబు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories