Homeసినిమా వార్తలుసమ్మర్ రిలీజ్ కన్ఫర్మ్ అంటున్న సూపర్ స్టార్

సమ్మర్ రిలీజ్ కన్ఫర్మ్ అంటున్న సూపర్ స్టార్

- Advertisement -

కరోనా పాండేమిక్ వల్ల ఒక్క హీరో అని కాదు అందరి హీరోల సినిమాలు ఆలస్యం అయ్యాయి. ఇండస్ట్రీలకి అతీతంగా ఈ ఇబ్బందులు ఎదురుకున్నారు. ఆ కారణంగా ప్రతీ స్టార్ హీరో సినిమా థియేటర్లలో విడుదల చేయడానికి సమయం పట్టింది. అందరిలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా థియేటర్లలోకి రావడానికి రెండేళ్లు పట్టింది. ఆయన నటించిన `సర్కారు వారి పాట` ఈ ఏడాది మేలో విడుదల అయిన సంగతి తెలిసిందే. తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు మాత్రం ఓవరాల్ గా పరవాలేదు అనిపించాయి. పెట్ల పరశురామ్ ఈ సినిమాని రూపొందించారు.

ఈ దశలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమా పై సూపర్ స్టార్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత మహేష్ – త్రివిక్రమ్ ల కలయికలో రాబోతున్న సినిమా కావడంతో సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నారు. ప్రాజెక్ట్ ప్రకటించి ఏడాది కావస్తున్నా వివిధ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అనుకున్న దాని కంటే ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమా షూటింగ్ తాలూకు సమాచారం అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ తమ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.

READ  మహేష్ బాబు థియేటర్ లో సర్కారు వారి పాట రికార్డ్
https://twitter.com/haarikahassine/status/1545643162319785984?t=1AyS0hHBnmtY2h3jFkZEow&s=19

అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న కాంబినేషన్ కి రంగం సిద్ధం అయింది. భారీ స్థాయిలో ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి అని ఈ మేరకు నిర్మాతలు తెలిపారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2023 వేసవిలో రానుందని, భారీ విస్ఫోటనం కు సిద్ధంగా ఉండండి అంటూ అభిమానులను ఉత్తేజ పరిచే విధంగా ప్రకటించారు నిర్మాతలు.

Follow on Google News Follow on Whatsapp

READ  ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ అంటున్న పక్కా కమర్షియల్ ప్రొడ్యూసర్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories