సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 12 ఏళ్ల తర్వాత రానున్న సినిమా ప్రస్తుతం SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉంది. 2019 లో వచ్చిన మహర్షి తర్వాత మహేష్ బాబు సరసన పూజా హెగ్డే మరోసారి కనిపించనున్నారు.
ఈ సినిమా మొదటి షెడ్యూల్ సెప్టెంబర్‌లో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ స్థాయిలో ప్రారంభమైంది. అక్కడ చిత్ర బృందం ఒక వారం పాటు జరిగిన షెడ్యూల్‌లో కొన్ని హై-ఆక్టేన్ ఎపిక్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబడ్డాయి. రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుందని నిర్మాత నాగ వంశీ ఇటీవల తెలిపారు.
అయితే త్రివిక్రమ్‌తో మహేష్‌బాబు తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక సినిమా విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. టీమ్ ప్లానింగ్ సరిగా లేదని, ప్రొడక్షన్ హౌస్ దే తప్పిదమని మహేష్ అభిమానులు విసుగు చెందుతున్నారు.
సర్కారు వారి పాట సినిమా విడుదలై ఇప్పటికీ 6 నెలలు గడుస్తున్నా .. మహేష్ బాబు నుండి పెద్దగా సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ రావడం లేదు. ముందుగా SSMB28 స్క్రిప్ట్‌ని ఓకే చేయడానికి మహేష్ కొంత సమయం తీసుకున్నారు.
పైన చెప్పిన విధంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర బృందం మొదటి షెడ్యూల్‌ని ప్లాన్ చేసింది. కానీ అది మధ్యలోనే రద్దు చేయబడింది. అందుకు కారణం మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ఇద్దరికీ అవుట్‌పుట్ నచ్చకపోవడమే.. అందువల్ల సినిమాకి ముందుగా అనుకున్నా ఫైట్ మాస్టర్‌ను మార్చారు.
ఇక ఆ తర్వాత మహేష్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని త్రివిక్రమ్ ను కోరారట. అందుకు అనుగుణంగా త్రివిక్రమ్ చేసిన మార్పులు సంతృప్తికరంగానే ఉన్నాయని అంతర్గత వర్గాల సమాచారం అందుతోంది. అయినప్పటికీ రకరకాల కారణాల వల్ల ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఆర్టిస్టులు మరియు సాంకేతిక నిపుణుల తేదీలు ఈ నెలలో అందుబాటులో లేవట. కాబట్టి షూటింగ్ షెడ్యూల్ ఇప్పుడు డిసెంబర్‌కి వాయిదా పడిందట.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూజా హెగ్డే కథానాయిక అవగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.