Homeసినిమా వార్తలుఆ విషయంలో పరశురాందే తప్పు అంటున్న మహేష్ ఫ్యాన్స్

ఆ విషయంలో పరశురాందే తప్పు అంటున్న మహేష్ ఫ్యాన్స్

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు పెట్లా పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన “సర్కారు వారి పాట” రేపటి నుండి అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఇక కొత్త వివాదం తెర మీదకు వచ్చింది.సినిమా ధియేటర్ లలో విడుదలైన రోజే ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా తమన్ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తన స్థాయిలో ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అలాగే ట్విట్టర్ లో మహేష్ ఫ్యాన్స్ తమన్ ను ట్రాల్ చేయడం కూడా జరిగింది.

ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సంగీత దర్శకుడు తమన్ ఒక ఆసక్తికర విషయం చెప్పారు.అదేంటంటే సర్కారు వారి పాట సినిమా ఇంటర్వల్ ముందు వచ్చే బీచ్ సీన్ కి వచ్చే నేపథ్య సంగీతం (background score) ముందు అనుకున్నది కాదట, ఆ సీన్ తో పాటుగా విలన్ సముద్రఖని ఒక పూజ/హోమం చేసే సీన్ కూడా సమాంతరంగా నడిపి ఆ దశలో వచ్చే మంత్రాలతో సన్నివేశాన్ని రక్తికట్టించారట. అయితే ఎడిటింగ్ సమయంలో ఆ హోమం సన్నివేశం తీసివేశారని,అందువల్ల వేరే మ్యూజిక్ మళ్ళీ ఇవ్వాల్సి వచ్చిందని, అంతకు ముందు పడ్డ కష్టం అంతా వృధా అయిపోయిందని తమన్ చెప్పుకొచ్చారు. సినిమాల విషయంలో ఇది సహజంగా జరిగేదే. ఒక్కోసారి సన్నివేశాలు,పాటలు ,పాత్రలనే మార్చడం లేదా తీసి వేయడం జరుగుతుంది.

అయితే ఈ విషయం తెలిసిన మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు దర్శకుడు పరశురాం మీద కాస్త కోపం గానే ఉన్నారు.మంచి ఊపుని ఇచ్చే సన్నివేశం ఎందుకు తీసేశారు అని విరుచుకుపడుతున్నారు.అయినా సినిమా ముందు వరకు ఫలానా దర్శకుడిని ఆకాశానికి ఎత్తేసి రిలీజ్ తరువాత మళ్ళీ తప్పుబట్టడం తెలుగు సినిమా అభిమానులకు అలవాటుగా మారింది. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ కి, ఇంతకు ముందు మహేష్ బాబు తో సినిమాలు చేసిన వంశీ పైడిపల్లి,అనీల్ రావిపూడి ఇప్పుడు పరశురాం పెట్లా. దర్శకుడు మారినా అభిమానుల తీరు మారదు ఎందుకంటే వాళ్ళకి అభిమాన హీరో సినిమా అంటే అన్ని అంచనాలు ఉంటాయి.

READ  నాలుగు భాషల్లో విడుదల కానున్న మహేష్ బాబు సినిమా

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories