Homeసినిమా వార్తలుపోకిరి స్పెషల్ షోలకు అద్భుతమైన స్పందన

పోకిరి స్పెషల్ షోలకు అద్భుతమైన స్పందన

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాటతో ప్రేక్షకులను పలకరించారు. ఆశించిన స్థాయిలో ఆ సినిమా టాక్ సంపాదించలేకపోయినా.. తన స్టార్డం తో కలెక్షన్లు బాగానే రాబట్టారు మహేష్.

అయితే అది అలా ఉండగా వచ్చే వారంలో ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌ భారీ స్థాయిలో సంబరాలు జరపనున్నట్లు తెలుస్తోంది. మహేష్ పుట్టినరోజైన ఆగస్టు 9న ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలు పోకిరి, ఒక్కడు పలు థియేటర్లలో స్పెషల్ ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే సన్నాహాలు మొదలైయాయి. అందులో భాగంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరిని మరోసారి రిమాస్టర్ చేసి 4K క్వాలిటీతో రీరిలీజ్ చేస్తున్నారు మహేష్ అభిమానులు.

2006 లో మహేష్ బాబు – పూరి జగన్నాథ్ ల కలయికలో వచ్చిన పోకిరి సినిమా 75 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబును సూపర్ స్టార్ ను చేసిన సినిమా పోకిరి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ కు తోడు కిక్ ఇచ్చే పంచ్ డైలాగ్స్, పండుగాడు క్యారెక్టర్ లో మహేష్ బాబు అద్భుతమైన నటన మరియు మ్యానరిజంలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా పోకిరి సినిమా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ కాబడి అవి ఆయా భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

READ  మన హీరోలు బంగారం అంటున్న దిల్ రాజు

2006లో వచ్చిన ఈ సినిమా మళ్లీ థియేటర్స్ లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేస్తోన్న స్పెషల్ షోలకు అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ఎంతగా అంటే బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటలోనే టికెట్లు అమ్ముడవడం మహేష్ స్టార్డం కు, మరియు పోకిరి సినిమాపై ఉన్న విశేషమైన ఆదరణకు అద్దం పడుతోంది. అలాగే వందకు పైగా స్పెషల్ షోలు ప్రదర్శింపబడుతున్న సినిమాగా రికార్డు సృష్టించినుంది పోకిరి.

స్పెషల్ షోల ద్వారా వచ్చిన డబ్బును MB ఫౌండేషన్ కు ఇవ్వాలని అభిమానులు, పంపిణీదారులు నిర్ణయించారట. MB ఫౌండేషన్ ద్వారా పిల్లలకు గుండె ఆపరేషన్లు, మరియు విద్యకు సహాయం చేయడానికి ఈ విరాళం ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా అభినందించదగ్గ విషయమే. హీరోగా సినిమాల్లోనే కాకుండా ఒక మనిషిగా మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతుంటారు. ఇప్పుడు ఆయన బాటలోనే వారి అభిమానులు సైతం ముందుకు సాగడం అనేది చాలా మంచి విషయం.

READ  ధనుష్ "సార్" ఫస్ట్ లుక్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories