టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న భారీ పాన్ వరల్డ్ మూవీ SSMB 29 చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పూర్తిగా బాడీని పెంచడంతో పాటు హెయిర్, గడ్డం కూడా పెంచుతున్నారు సూపర్ స్టార్. శ్రీ దుర్గ ఆర్ట్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో ఈ మూవీని కేఎల్ నారాయణ నిర్మించనుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
త్వరలో ఈ మూవీ అనౌన్స్ కానుంది. ఇక హోలీవుడ్ ఫామిలీ యాక్షన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ మూవీలో ప్రధానమైన ముఫాసా పాత్ర యొక్క తెలుగు వర్షన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందించనున్నారు అనేది కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన న్యూస్. అయితే విషయం ఏమిటంటే, అది నేడు కొద్దిసేపటి కన్ఫర్మ్ అయినట్లు అఫీషియల్ న్యూస్ వచ్చింది.
డిస్నీ స్టూడియోస్, పాస్టెల్ ప్రొడక్షన్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీని బ్యారీ జెన్కిన్స్ తెరకెక్కిస్తున్నారు. కాగా ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు ట్రైలర్ 26 ఆగష్టు ఉదయం 11 గం. 07 ని. లకు రిలీజ్ కానుంది. ఇక అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీని డిసెంబర్ 20న ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు.