అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత సందీప్ వంగా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. అప్పట్లో దాదాపు ప్రముఖ హీరోలందరి నుంచి ఆయనకు కాల్ వచ్చింది. అందులో మహేష్ కూడా ఉన్నాడు.తన కోసం మంచి సబ్జెక్టు రెడీ చేయాలని మహేష్ కోరినట్టు లోగడ ఒకసారి సందీప్ చెప్పడం జరిగింది.
ఈ సంగతులని సందీప్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో జరిగిన స్పేస్ లో చెప్పారుమహేష్ బాబుతో చాలా రోజుల క్రితమే సినిమా చేయాల్సింది. తాను మహేష్ ను బయట నాలుగైదు సార్లు కలిశానని, కోన్ని ఇంట్రెస్టింగ్ లైన్స్ కూడా వినిపించానని సందీప్ చెప్పుకొచ్చారు.
మహేష్ కి ఆ కథలు నచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రూపు దాల్చలేదని సమాచారంఆ తరువాత మహేష్ తో సందీప్ కొన్ని యాడ్ షూట్ కొరకు పనిచేశారు. ఇంతవరకు సినిమాల్లో మహేష్ బాబుని మనం చూసింది 25 శాతం మాత్రమే.75 శాతం మహేష్ బయట పడనేలేదని ముందుగా చెప్పుకున్నట్టు ఫ్యాన్స్ స్పేస్ లో సందీప్ చెప్పారు.
అంటే మహేష్ బాబు సత్తాని ఫిలిం మేకర్స్ ఇప్పటి వరకు 25 శాతం మాత్రమే ఉపయోగించుకున్నారు అని సందీప్ పరోక్షంగా తెలిపారు.ఇక ఆ 75 శాతం మహేష్ ను తెరపై చూపించే అవకాశం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా ఆ పైన రాజమౌళితో సినిమా అయ్యాక మహేష్ సందీప్ దర్శకత్వంలో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నారు అని తెలుస్తుంది. ఇది నిజం అయితే అటు మహేష్ ఫ్యాన్స్ కు ఇటు మూవీ లవర్స్ కు పండగనే చెప్పాలి. మోస్ట్ అవెయిటడ్ కాంబో అయిన ఈ కలయిక వీలయినంత త్వరగా ప్రకటిస్తారని ఆశిద్దాం.