టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో తన తదుపరి భారీ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ లెవెల్లో నిర్మించనుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈమూవీకి సంబంధించి ఇప్పటికే స్టోరీ, స్క్రిప్ట్ తో పాటు ఇతర పనులు అన్ని కూడా వేగంగా కానిచ్చేస్తున్నారట జక్కన్న అండ్ టీమ్. ఈ మూవీ కోసం ఇప్పటికే మహేష్ బాబు ఫుల్ గా బాడీని గడ్డం, క్రాఫ్ ని కూడా పెంచుతున్నారు. ఇక ఈ క్రేజీ మూవీ గురించి ఏ చిన్న న్యూస్ బయటకు వచ్చినా అది ఎంతో వైరల్ అవుతోంది.
విషయం ఏమిటంటే, తాజాగా వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం SSMB 29 మూవీకి గోల్డ్ అనే టైటిల్ ని టీమ్ పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు. ఇందులో మహేష్ బాబు క్యారెక్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్ లో పవర్ఫుల్ గా డిజైన్ చేస్తున్నారట జక్కన్న. మరి ఈ న్యూస్ లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే టీమ్ నుండి దీని పై అధికారికంగా ప్రకటన రావాలి.