టాలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో SSMB 29 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రియాంక చోప్ర, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పాన్ వరల్డ్ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా శ్రీ సాయి సూర్య డెవలపర్స్ సంస్థ వారి మనీ లాండరింగ్ కేసులో వారి ఆఫీస్ పై దాడి చేసి రూ.100 కోట్లకు విలువ చేసే డాక్యుమెంట్స్ తో పాటు రూ. 74 లక్షల డబ్బుని ఈడీ స్వాధీనం చేసుకుంది.
అయితే ఆ సంస్థ తరపున ప్రచార కర్త గా వ్యవహరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు వారి నుండి పారితోషంగా రూ. 5.9 కోట్లు తీసుకున్నారు,. అందులో 3.4 కోట్లు చెక్ రూపంలో అలానే రూ. 2.5 కోట్లు క్యాష్ రూపంలో తీసుకున్నారు. దీని పై మహేష్ కి కూడా ఈడీ నోటీసులు జారీ చేసి ఏప్రిల్ 28న తమ ముందు హాజరు కావాలని కోరారు.
కాగా ప్రస్తుతం తన సినిమా షూటింగ్ విషయంలో పూర్తి బిజీగా ఉన్న తను, కొంత సమయం కావాలని తన తరపు లాయర్లు ద్వారా మహేష్ బాబు ఈడీని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసారు. మరి ఈ కేసు రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాలి.