ఇటీవల త్రివిక్రమ్ తో చేసిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ తరువాత దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ మూవీలో తన రోల్ కోసం పూర్తిగా బాడీని ఫుల్ గా క్రాఫ్, గడ్డం పెంచుతున్నారు మహేష్.
శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపుగా రూ. 1000 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ మూవీ ఫై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మూవీ గురించి మాట్లాడుతూ, తనకు ఉన్న సమాచారాన్ని బట్టి SSMB 29 మూవీ గతంలో రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలకు ఎన్నోరెట్లు మించిన బాప్ మాదిరిగా ఉంటుందని అన్నారు.
ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి ఎందరో హాలీవుడ్ టెక్నీషియన్స్ ని అక్కడి పలు సంస్థల్ని కలిసారని, తప్పకుండా ఈ మూవీ మన భారతదేశం గర్వంగా ఫీలయ్యే రేంజ్ లో రాజమౌళి తెరకెక్కిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు వర్మ. కాగా వర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.