యువ నటుడు శ్రీసింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మత్తువదలరా 2. ఇటీవల రిలీజ్ అయి ఆడియన్స్ ని మెప్పించిన మత్తువదలరా 1కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీని క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థల పై చిరంజీవి చెర్రీ, హేమలత గ్రాండ్ గా నిర్మించగా కాల భైరవ సంగీతం అందించారు.
తాజాగా మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ తో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ హిలేరియస్ ఫన్ రైడ్ ని ఆడియన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రసంశలు కురిపించారు.
నేడు తన కుటుంబంతో కలిసి మత్తువదలరా 2 మూవీ చూశానని, మూవీ అంతా ఎంతో బాగుందని, ముఖ్యంగా కమెడియన్ సత్య కామెడీకి తనతో పాటు కూతురు సితార కూడా ఎంజాయ్ చేసిందని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేసారు. కాగా సూపర్ స్టార్ పాజిటివ్ ట్వీట్ అనంతరం ఈ మూవీకి మరింత క్రేజ్ పెరిగింది.