టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 చేయనున్న విషయం తెల్సిందే. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్న ఈమూవీని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో నిర్మించనుండగా వి విజయేంద్రప్రసాద్ కథని అందించనున్నారు.
ఇప్పటికే ఈ మూవీ కోసం పూర్తిగా బల్క్ బాడీ పెంచడంతో పాటు క్రాఫ్, గడ్డం కూడా పెంచుతూ న్యూ లుక్ తో సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. విషయం ఏమిటంటే, తాజాగా మహేష్ బాబు ఫుల్ గడ్డం క్రాఫ్ తో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ లుక్ ని బట్టి చూస్తుంటే మహేష్ బాబు తన కెరీర్ లోనే బెస్ట్ లుక్ ఇది కాబోతోందని, రాజమౌళి తప్పకుండా ఈ మూవీని ప్రపంచం మొత్తం అదిరిపోయే రీతిలో రూపొందించడం ఖాయం అంటున్నారు పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఆడియన్స్. మొత్తంగా ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుండడంతో సింహం తీరున తమ హీరోని చూసిన సూపర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా తమ మైండ్ బ్లాక్ అయిందని, ఆయన హాలీవుడ్ రేంజ్ లో ఉన్నారని కామెంట్ చేస్తున్నారు.