సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈమూవీ సంక్రాంతికి రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది. ఇక దాని అనంతరం ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో హీరోగా నటించనున్నారు మహేష్.
శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీ త్వరలో అనౌన్స్ కానుంది. మరోవైపు మూవీలో తన పాత్ర కోసం మహేష్ బాబు బల్క్ గా బాడీని పెంచుతుండడంతో పాటు పలు యుద్ధ విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. విషయం ఏమిటంటే, ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు, నేడు హైదరాబాద్ చేరుకున్నారు.
ఆ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మహేష్ బాబుని ఫోటోలు తీసింది స్థానికి మీడియా. ఇక ఆ ఫొటోల్లో మహేష్ బాబు గుబురు గడ్డం, ఫుల్ క్రాఫ్, బల్క్ బాడితో ఎంతో పవర్ఫుల్ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మూవీలో భారతీయ సినిమా పరిశ్రమతో పాటు పలువురు హాలీవుడ్ నటులు కూడా నటించనున్నట్లు టాక్. ప్రస్తుతం వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న SSMB 29 పక్కాగా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.