టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. దీని తరువాత త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీయనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ఆయన నటించనున్న విషయం తెలిసిందే.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీలో తన పాత్ర కోసం మహేష్ బాబు ఫుల్ గా క్రాఫ్ గడ్డంతో పాటు బాడీని కూడా పెంచుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు పలు యుద్ధ విద్యల్లో కూడా ఆయన శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. విషయం ఏమిటంటే, తాజాగా హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో సందడి చేసారు మహేష్ బాబు ఫ్యామిలీ.
ఈ సందర్భంగా అక్కడ మూవీ చూసి బయటకు వచ్చిన మహేష్ బాబు లుక్ ని చూసి అందరూ షాక్ అవుతున్నారు, ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ అయితే మరింత ఆశ్చర్యపోతున్నారని చెప్పాలి. బాగా బల్క్ గా మారడం, ఫుల్ క్రాఫ్, గడ్డంతో పాటు మహేష్ పేస్ లుక్ మరింత చబ్బీగా మారింది. దీనిని బట్టి రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు ఎంతో బాగా న్యూ లుక్ తో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా SSMB 29 అనౌన్స్ మెంట్ కోసం ప్రపంచం మొత్తం కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది.