టాలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. దీని అనంతరం దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 కోసం ఆయన అన్ని విధాలా సిద్దమవుతున్న విషయం తెలిసిందే.
ఈ ప్రతిష్టాత్మక మూవీని శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక మరోవైపు పలు యాడ్స్ కూడా చేస్తూ దూసుకెళ్తున్న మహేష్ బాబు తాజాగా ఒక హాలీవుడ్ మూవీకి వర్క్ చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇక ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన హాలీవుడ్ మ్యూజికల్ యాక్షన్ డ్రామా మూవీ ది లయన్ కింగ్. దానికి సీక్వెల్ గా ప్రస్తుతం ముఫాసా మూవీ రూపొందుతోంది.
దీనిని బ్యారీ జెన్కిన్స్ తెరకెక్కిస్తుండగా వాల్ట్ డిస్నీ పిక్చర్స్, ప్యాస్టల్ ప్రొడక్షన్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. విషయం ఏమిటంటే, ఈ మూవీలో ప్రముఖ పాత్ర అయిన ముఫాసా పాత్ర తెలుగు వాయిస్ ఓవర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు అందించనున్నారని అంటున్నారు. మహేష్ కూడా ముఫాసా పాత్రకు తన వాయిస్ అందించేందుకు సుముఖంగా ఉన్నారని టాక్. కాగా దీని పై అఫీషియల్ క్లారిటీ అయితే రావాల్సి ఉంది.