టాలీవుడ్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, నటసింహం నందమూరి బాలకృష్ణ ఇద్దరూ కూడా ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ప్రాజక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం యువ దర్శకుడు బాబీతో NBK 109 మూవీ చేస్తున్నారు బాలకృష్ణ.
సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానుంది. మరోవైపు త్వరలో SSMB 29 మూవీ షూట్ కోసం సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ మూవీని ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్నారు.
అయితే విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి త్వరలో ఒక మూవీలో నటించనున్నారని తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక ప్రోగ్రాం లో భాగంగా మాట్లాడుతూ చెప్పారు. అయితే ఇది పక్కాగా ఎప్పుడు ప్రారంభం అయి పట్టాలెక్కుతోంది, ఎవరు నిర్మనించనున్నారు, ఎవరు దర్శకత్వం వహించనున్నారు అనే పూర్తి వివరాలు మాత్రం వెల్లడి కావాల్సి ఉంది. కాగా ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించి పూర్తిగా తెలియాలి అంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే