టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 గ్రాండ్ లెవెల్లో అత్యధిక వ్యయంతో రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ స్థాయిలో నిర్మించనుండగా ఎం ఎం కీరవాణి సంగీతాన్ని, వి విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే మూవీలోని తన పాత్ర కోసం ఫుల్ గా బల్క్ బాడీ ని అలానే క్రాఫ్, గడ్డం కూడా పెంచుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. విషయం ఏమిటంటే, ఈ భారీ మూవీలో మహేష్ బాబు కొన్ని నిమిషాల పాటు శ్రీరాముడి అవతారంలో కనిపించనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ కి కొద్దిగా రామాయణంతో లింక్ ఉంటుందని టాక్.
గతంలో రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్లైమాక్స్ లో రాముడి గెటప్ లో కనిపించి మంచి క్రేజ్ అందుకున్నారు. అలానే ఈ మూవీలో కూడా మహేష్ బాబు రాముడి సీన్స్ ని ఎంతో జాగ్రత్తగా తీసేలా డిజైన్ చేస్తున్నారట జక్కన్న. అయితే ప్రతుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే SSMB 29 మూవీ తెరకెక్కి ఆపై రిలీజ్ వరకు ఆగాల్సిందే అని తెలుస్తోంది.