Home సినిమా వార్తలు SSMB28: పోకిరి డేట్ కు రానున్న మహేష్ – త్రివిక్రమ్ సినిమా

SSMB28: పోకిరి డేట్ కు రానున్న మహేష్ – త్రివిక్రమ్ సినిమా

Mahesh Babu & Trivikram's #SSMB28 To Have Star Cast

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న SSMB 28 సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని నిర్ణయించుకుంది. ఈ చిత్రం 28 ఏప్రిల్ 2023న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం ఈ భారీ అప్‌డేట్‌ను కాసేపటి క్రితం సోషల్ మీడియాలో ప్రకటించారు. అంతే ఇంక ఈ వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది. మహేష్ అభిమానులు ఈ అప్డేట్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు.

https://twitter.com/haarikahassine/status/1560228968254414848?t=NT2MUCsJUoPjE0UhzeXCRQ&s=19

SSMB 28 సినిమాతో పన్నెండు సంవత్సరాల తర్వాత దిగ్గజ దర్శకుడు త్రివిక్రం – మహేష్ బాబు కాంబినేషన్లో మళ్ళీ సినిమా రానుంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌లకు ఇది మూడో సినిమా. చిత్ర నిర్మాతలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గత సంవత్సరం ఈ సినిమాను ప్రకటించినప్పుడే అభిమానులు ఎంతగానో ఆనందించారు.

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కొందరు బాలీవుడ్ మరియు మలయాళ స్టార్ ల పేర్లు వినిపించినా ఇంకా ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. తాజాగా, ‘అల వైకుంఠపురములో’ చిత్రం తరువాత దర్శకుడు త్రివిక్రమ్ ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల పై దృష్టి సారిస్తున్నారు.

అయితే మహేష్ తో చేయబోయే సినిమాకు మాత్రం కథా నేపథ్యంతో పాటు అందుకు సంబంధించిన ట్రీట్‌మెంట్ అంటే సినిమాని తెరకెక్కించే విధానం కూడా భిన్నంగా ఉంటుందని మహేష్ స్పష్టం చేశారు. తాజా నివేదికల ప్రకారం, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే ఆసక్తి చూపట్లేదు.

ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్నారు అంటేనే అభిమానులతో పాటు ఇతర సినీ ప్రేక్షకులకు కూడా ఎంతో ఆసక్తిని పెంచే కలయిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ చిత్రం అందరి అంచనాలు అందుకోవాలి అని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version