పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 ఏడి. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది.
మరోవైపు కల్కి మూవీ చూసిన పలువురు ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం ప్రసంశలు కురిపిస్తున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయంన్ని వ్యక్తపరిచారు. తాను కల్కి 2898 ఏడి మూవీ చూసి ఆశ్చర్యపోయానని, ఎంతో అద్భుతంగా దర్శకుడు నాగ అశ్విన్ దానిని తెరకెక్కించారని అన్నారు.
ఇక హీరో ప్రభాస్, సీనియర్ నటులు అమితాబ్, కమల్ తో పాటు హీరోయిన్ దీపికా ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి అద్భుతమైన పెర్ఫార్మన్స్ కనబరిచారని, ఇంతటి గ్రాండియర్ మూవీని మనకు అందించిన వైజయంతి మూవీస్ సంస్థతో పాటు కల్కి టీమ్ మొత్తానికి శుభాభినందనలు తెలిపారు సూపర్ స్టార్ మహేష్. కాగా మహేష్ చేసిన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తాలూకు ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.