టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి.
త్వరలో ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఇక విషయం ఏమిటంటే, నేడు కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసారు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత. ఇటీవల వరద బాధితుల సహాయార్ధం తాను ప్రకటించిన రూ. 50 లక్షలతో పాటు అదనంగా తన ఏఎంబి వారి తరపు నుండి మరొక రూ. 10 లక్షల చెక్ ని ఆయనకు అందచేశారు మహేష్ బాబు దంపతులు.
కాగా వారితో పాటు ఏషియన్ సునీల్ తదితరులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు లేటెస్ట్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా వైరల్ అవుతున్నాయి. ఆయన లుక్ ని బట్టి రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి SSMB 29 పక్కాగా ఎప్పుడు మొదలవుతుందో, షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియాలి అంటే మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేవరకు ఆగాల్సిందే అని అర్ధమవుతోంది.