ఇటీవల పెద్దగా అంచనాలు లేకుండా ఆడియన్సు ముందుకి వచ్చిన పాన్ ఇండియన్ యానిమేషన్ డివోషనల్ మూవీ మహావతార్ నరసింహ. ఈ మూవీని క్లీం ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించగా యువ దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించారు. కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు దీనికి సమర్పకులుగా వ్యయవహరించారు.
అయితే రిలీజ్ అయిన తొలి రోజు నుండి అన్ని భాషల ఆడియన్సు ద్వారా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఇంకా మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది.
ముఖ్యంగా నార్త్ ఆడియన్సు ఈ మూవీకి మరింత కనెక్ట్ అవుతున్నారు. ఇటీవల భారీ సినిమాలైన కూలీ, వార్ 2 రెండూ కూడా రిలీజ్ అయి అంతగా రెస్పాన్స్ అందుకోకపోవడంతో అవి రెండు ప్రస్తుతం బాక్సాఫిస్ వద్ద అంతంతమాత్రమే కలెక్షన్స్ అందుకుంటున్నాయి. దానితో ఆడియన్సు మరింతగా మహావతార్ నరసింహకి వెళ్లేందుకు క్యూ కడుతున్నారు.
ఇటీవల రూ. 300 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకున్న ఈ యానిమేషన్ డివోషనల్ మూవీ ఓవరాల్ గా ఎంతమేర రాబడుతుందో చూడాలి. కాగా ఈ మూవీలో శ్రీమహావిష్ణువు యొక్క వరాహావతారం మరియు క్లైమాక్స్ లో వచ్చే నరసింహావతార సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.