Home సినిమా వార్తలు Maharaja OTT Release ‘మహారాజా’ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Maharaja OTT Release ‘మహారాజా’ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Maharaja ott release

భారతీయ సినిమా పరిశ్రమ గర్వించదగ్గ గొప్ప నటుల్లో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కూడా ఒకరు. కెరీర్ బిగినింగ్ నుండి పలు విభిన్న పాత్రలు సినిమాలతో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ కొనసాగుతున్న విజయ్ సేతుపతి తెలుగు ఆడియన్స్ కి కూడా ఎంతో సుపరిచితం. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ మహారాజా.

ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్ల పై సుధన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీ జూన్ 14న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో కూడా మహారాజాకు భారీ కలెక్షన్ లభించింది. అయితే విషయం ఏమిటంటే, జులై 12 నుండి ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కానున్న భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

ఈ విషయమై నెట్ ఫ్లిక్స్ వారు తాజాగా తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో మహారాజ ఓటిటి రిలీజ్ డేట్ ప్రకటించారు. బార్బర్ పాత్రలో విజయ్ సేతుపతి నటించిన ఈ మూవీలో బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించగా నటరాజ్, భారతీరాజా, మమతామోహన్ దాస్, భారతి రాజా, అభిరాం తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version