Homeసినిమా వార్తలుమెగాస్టార్ తో కలిసి చిందులేయనున్న సల్మాన్ ఖాన్

మెగాస్టార్ తో కలిసి చిందులేయనున్న సల్మాన్ ఖాన్

- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి ఈ మధ్య వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో గాడ్ ఫాదర్‌, భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్‌) వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో ముందుగా విడుదల అవబోతున్న సినిమా గాడ్ ఫాదర్.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవలే స‌ల్మాన్ తన షూటింగ్ పార్ట్ ను దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. కొన్ని సన్నివేశాలు మరియు ఒక పాట మాత్రం బ్యాలన్స్ ఉందని సమాచారం.

స‌ల్మాన్ ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను పోషిస్తున్నారట. చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ కాంబినేషన్ లో వచ్చే స‌న్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయ‌ని గట్టి ప్రచారం జరుగుతుంది . తెలుగులో స‌ల్మాన్‌ఖాన్ న‌టించ‌డం ఇదే తొలిసారి కావడం అందులోనూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడం ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌లు ఇద్ద‌రూ ఒకే చోట కనిపించ‌డం అభిమానుల‌కు పండగే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

READ  NBK107: క్రిస్మస్ కానుకగా విడుదల అవుతున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని

కాగా ఈ సినిమాకి సంబందించిన మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకి వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మరియు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి ఒక పాటలో కనిపిస్తారన్న విషయం ఇదివరకే చిత్ర యూనిట్ చెప్పారు. ఆ పాటకు సంభందించిన షూటింగ్ ఈరోజే మొదలు కానుందని సమాచారం.

యావత్ దక్షిణ భారతంలోనే ఉత్తమ నృత్య దర్శకుడు అయిన ప్రభుదేవా ఈ పాటకు నృత్య నేతృత్వం వహిస్తారు అని తెలుస్తోంది. డాన్స్ విషయంలో ప్రభుదేవాకి ఉన్న పేరు మరియు ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఆయన కొరియోగ్రఫీ అందించిన పాటలకు అంతే లయబద్దంగా డాన్స్ చేసి మెగాస్టార్ అలరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి కొన్నాళ్ళ గ్యాప్ తరువాత ప్రభుదేవా చిరంజీవి పాటకు డాన్స్ కొరియోగ్రఫీ అందించడం, ఆ పాటలో మెగాస్టార్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా స్టెప్పులు వేయబోతుండడం అభిమానులు మరియు ప్రేక్షకుల అంచనాలను పెంచే విషయాలే. మరి ఈరోజు షూటింగ్ ప్రారంభం కానున్న ఈ పాట విడియో వచ్చాక, ఆ తరువాత సినిమాలో చూసి ప్రేక్షకులు ఎంతగా ఆనందం పొందుతారో చూడాలి.

READ  Ponniyan Selvan First Look: అదిరిపోయిన ఐశ్వర్యా రాయ్ ఫస్ట్ లుక్

కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు అని తెలుస్తోంది. త్వరలోనే అందుకు సంభందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories