టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ ఒకరు. ఇటీవల మాచర్ల నియోజక వర్గం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే మాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనుకున్న నితిన్ కు ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. తాజాగా ఈ సినిమా OTT విడుదల తేదీ ఖరారు అయింది.
ఎట్టకేలకు డిసెంబర్ 9న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అయిన Zee5లో సినిమా విడుదలవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఆ రకంగా థియేటర్లలో విడుదలైన 120 రోజుల తర్వాత అంటే 4 నెలల తరువాత ఓటిటి లో అందుబాటులోకి వస్తుంది అన్నమాట.
ఈ రోజుల్లో, దాదాపు అన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన 4 వారాల్లోనే OTTలో విడుదల అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ చిత్రం OTT లో విడుదల కావడానికి చాలా సమయం పట్టింది. ఈ సినిమా OTT విడుదల పై ప్రేక్షకులు కొన్ని రోజులుగా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక ఈ వార్తతో చివరకు వారి కోరికలు నెరవేరినట్లే.
మాచర్ల నియోజకవర్గం నితిన్ ప్రధాన పాత్రలో MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్D ఎంటర్‌టైనర్. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మాచర్ల నియోజక వర్గం ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా 950 వరకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. విడుదలకి ముందే ట్రైలర్,టీజర్స్ తో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతే కాదు తమ అభిమాన హీరో నుంచి మంచి హిట్ వస్తుందని ఆశించిన నితిన్ అభిమానులను నిరాశపరిచింది. అందుకే ఈ సినిమా తర్వాత నితిన్ తన తదుపరి సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. కేథరిన్ త్రెసా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ఇతర సపోర్టింగ్ రోల్స్‌లో నటించగా, సముద్రఖని మెయిన్ విలన్‌గా కనిపించిన ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించారు.