టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన కెరీర్ 109వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇక మరోవైపు ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో ఎంటర్టైనింగ్ షో అన్ స్తాపబుల్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు బాలకృష్ణ.
ఇప్పటికే మూడు సీజన్స్ ఎంతో ఆకట్టుకున్న ఈ షో యొక్క 4వ సీజన్ ఇటీవల ప్రారంభం కాగా, ఫస్ట్ ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందడి చేసారు. విషయం ఏమిటంటే, సెకండ్ ఎపిసోడ్ యొక్క ప్రోమోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు. కాగా ఈ ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ టీమ్ సందడి చేసింది. హీరో దుల్కర్ సల్మాన్ తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి, నిర్మాత నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి ఈ షోలో పాల్గొన్నారు.
ముఖ్యంగా వారితో కలిసి బాలకృష్ణ ఎంతో సరదాగా ఎంటర్టైనింగ్ ప్రశ్నలతో ఉర్రూతలూగించారు. ముఖ్యంగా ఈ ప్రోమోలో దిల్ రాజు గారు అప్పుడప్పుడు పింక్ ఫ్యాంట్ వేసుకుని వస్తారు, అది వద్దని చెప్పాలని వుందని నాగవంశీ అనడం, తన కార్ ని 300 స్పీడ్ తో డ్రైవ్ చేస్తానని హీరో దుల్కర్ చెప్పడం, ఎప్పటి నుంచో హీరోయిన్ పూజా హెగ్డే మీద దర్శకుడు వెంకీ అట్లూరికి కన్నుందని నాగవంశీ చెప్పడం సహా మరికొన్ని సరదా అంశాలు చూపించారు. ఇక ఈ ప్రోమోని బట్టి చూస్తుంటే సెకండ్ ఎపిసోడ్ ఎంతో అదిరిపోతుంది తెలుస్తోంది. కాగా ఈ ఎపిసోడ్ ని దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 31న రాత్రి 7 గం. లకు ఆహాలో ప్రసారం చేయనున్నారు.