మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్ ఇటీవల తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో చేసిన సీతారామం మూవీతో ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక అక్కడి నుండి కెరీర్ పరంగా తెలుగులో కూడా మంచి స్క్రిప్ట్స్ దొరికితే చేయడానికి సిద్దమైన దుల్కర్ ఇటీవల యువ దర్శకుడు వెంకీ అట్లూరి తో లక్కీ భాస్కర్ మూవీ చేయడనికి సిద్ధమయ్యారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీలో యువ అందాల నటి మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ సంగీతం సమకూర్చారు.
ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండి అందరిలో మంచి ఆసక్తిని రేకెత్తించిన ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేడు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇక ముఖ్యంగా కథ గురించి మాట్లాడుకుంటే బ్యాంక్‌లో పనిచేస్తున్న భాస్కర్ క్యాషియర్ రిస్క్ చేసి నగదు కొరత ఉన్న రిస్క్‌తో కూడిన పెట్టుబడి పథకాన్ని ప్రారంభించి ఆపై మనీలాండరింగ్ లో చిక్కుకుంటాడు. అయితే ఈ ఫైనాన్షియల్ క్రైమ్ డ్రామా అంశంలో హెచ్చు తగ్గులు లేకుండా అతని ఆర్థిక ప్రయాణం చివరివరకు ఎలా సాగింది అనేది మిగిలిన కథాంశం. ముఖ్యంగా ఎప్పటివలె మరొక్కసారి ఈమూవీ ద్వారా సూపర్ యాక్టింగ్ చేసి ఆకట్టుకున్నారు దుల్కర్.
భాస్కర్ పాత్రలో ఆయన నటన బాగుంది, పలు కీలక యాక్షన్ సీన్స్ లో మరింతగా ఆకట్టుకున్నారు. హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి అందంతో పాటు అభినయం కూడా ప్రదర్శించి అలరించారు. ఇక రాజ్‌కుమార్ కసిరెడ్డి పోషించిన పాత్రతో తోపాటు రామ్‌కి పాత్ర కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుంది. డ్రామా, క్రైమ్ మరియు ఎమోషన్స్ తో సాగె ఈ కథలో భాస్కర్ ప్రతి అంశాన్ని అర్థం చేసుకోని లక్కీగా మార్కెట్‌లో ఉన్నతంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు, సాధించే విజయాల తాలూకు సీన్స్ బాగుంటాయి.
ముఖ్యంగా సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ పలు కీలక సీన్స్ లో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్. ఇక క్రైమ్ తో పాటు చివర్లో ఎమోషన్స్ వంటివి కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా దర్శకుడు వెంకీ తాను తీసుకున్న పాయింట్ ని ఎక్కడా కూడా ఆడియన్స్ చూపు తిప్పుకోకుండా తన కథనాన్ని కనెక్ట్ అయ్యేలా రాసుకున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ అండ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఎంతో బాగుండగా సెకండ్ హాఫ్ కొంత ముందుకు సాగిన అనంతరం ససాగె కథనం, చిన్న ట్విస్టులు, ఇతర అంశాలు ఆకట్టుకుంటాయి.
ప్లస్ పాయింట్స్ :
దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్
స్క్రీన్ ప్లే
అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఆకట్టుకునే ఫస్ట్ హాఫ్
అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్
గొప్ప సినిమాటోగ్రఫీ
అలరించే రచన
డైలాగ్స్
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్‌లో 15-20 నిమిషాలు నిదానం
బలహీనమైన పాటలు
పేసింగ్ సమస్యలు
మొత్తంగా చెప్పాలి అంటే లక్కీ భాస్కర్ మూవీ అలరించే యాక్షన్ థ్రిల్లింగ్ క్రైమ్ అంశాలతో సగటు ఆడియన్ కి కావలసిన అన్ని అంశాలను అందిస్తుంది. సెకండ్ హాఫ్ చివరి 20 నిముషాలు నెమ్మదించినా అది కథనంలో భాగంగా సాగడంతో మనకు ఇబ్బంది అనిపించదు. ఫస్ట్ షో నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ రాబోయే రోజుల్లో ఏతమేర విజయం అందుకుని కలెక్షన్ తో ముందుకి సాగుతుందో చూడాలి.
రేటింగ్ : 3. 25 / 5