యువ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా యువ అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈ మూవీలో సచిన్ ఖేడేకర్, రామ్ కీ, సర్వదమన్ బెనర్జీ, టిన్ను ఆనంద్ కీలక పాత్రలు పోషించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలని ఏర్పరిచిన ఈమూవీ దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. దుల్కర్ సూపర్ యాక్టింగ్ తో పాటు దర్శకుడు వెంకీ అద్భుతంగా తెరకెక్కించిన తీరు పై ప్రేక్షకుల నుండి ప్రసంశలు కురుస్తున్నాయి.
ఇక ఈ మూవీ మొత్తంగా గడిచిన మూడు రోజుల్లో రూ. 34 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. అలానే ఈ వీకెండ్ లో ఇది రూ. 45 కోట్లని దాటేసే అవకాశం ఉంది. అటు తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో కూడా లక్కీ భాస్కర్ అదరగొడుతుండడంతో ఓవరాల్ గా ఇది రూ. 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం కనపడుతోంది. ఇక ఈ మూవీ యొక్క విజయంతో తెలుగులో కూడా నటుడిగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు దుల్కర్