యువ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ లక్కీ భాస్కర్. జివి ప్రకాష్ సంగీతం అందించిన ఈ మూవీలో సర్వధమన్ బెనర్జీ, సుధ, రామ్ కీ, టిన్ను ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. మంచి అంచనాలతో ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది.
ఓవరాల్ గా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలపై సాయి సౌజన్య, నాగ వంశీ భారీ స్థాయిలో నిర్మించారు.
కాగా ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చిన లక్కీ భాస్కర్ మూవీ ప్రస్తుతం దాదాపుగా 18 బిలియన్ నిమిషాల వ్యూస్ తో రెండు వారాలుగా రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఆకట్టుకునే కథకథనాలతో రూపొందిన ఈ సినిమా అన్ని భాషల ఓటిటి ఆడియన్స్ ని అలరిస్తుండడంతో మూవీ టీం ఆనందం వ్యక్తం చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో లక్కీ భాస్కర్ మూవీ ఓటిటిలో ఇంకెంతమేర వ్యూస్ రాబడుతుందో చూడాలి.