యువ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ యాక్షన్ మూవీ లక్కీ భాస్కర్. ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ స్థాయిలో నిర్మించారు. అయితే మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ దీపావళి రోజున రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని ప్రస్తుతం థియేటర్స్ లో మంచి కలెక్షన్ రాబడుతోంది.
ముఖ్యంగా ఆకట్టుకునే కథ, కథనాలతో అలరించే స్క్రిప్ట్ తో దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీని తెరకెక్కించారు. అందరి నుండి సూపర్ టాక్ సొంతము చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది లక్కీ భాస్కర్ మూవీ. సచిన్ ఖేడేకర్, రామ్ కీ, మానస చౌదరి, సూర్య శ్రీనివాస్, సర్వదమన్ బనర్జీ తదితరులు ఇందులో కీలక పాత్రలు చేశారు.
ఇక ఈమూవీలో బ్యాంక్ అధికారి భాస్కర్ గా తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు హీరో దుల్కర్. ఇక ఈమూవీ యొక్క ఓటిటి రైట్స్ ని భారీ ధరకు ప్రముఖ ఓటిటి మాధ్యమాక్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. విషయం ఏమిటంటే, లక్కీ భాస్కర్ మూవీ నవంబర్ 30న ఓటిటి లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి డీల్ కుదిరినట్లు చెప్తున్నారు. మరి ఈలోపు ఓవరాల్ గా లక్కీ భాస్కర్ ఎంతమేర థియేటర్స్ లో ఆడియన్స్ ని అలరించి ఏస్థాయి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.