మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్ ఇటీవల తెలుగులో హను రాఘవపూడితో చేసిన సీతారామం మూవీ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఈ మూవీ అనంతరం అటు మలయాళంలో పలు ప్రాజక్ట్స్ తో బిజీగా ఉన్న దుల్కర్, తాజాగా తెలుగులో లక్కీ భాస్కర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన లక్కీ భాస్కర్ మూవీ మొన్న దీపావళి రోజున గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది.
యువ అందాల నటి మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వెంకీ అట్లూరి తెరకెక్కించగా సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన లక్కీ భాస్కర్ మూవీ తోలిరోజు తొలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
మలయాళంతో పాటు తెలుగులో కూడా ఫస్ట్ డే అదరగొట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో అయితే కలెక్షన్ అందుకోలేకపోతోంది. ముఖ్యంగా మూవీకి రెస్పాన్స్ బాగా వస్తున్నప్పటికీ టికెట్ రేట్స్ కారణంగా మూవీకి ఆశించిన స్థాయి కలెక్షన్ రావడం లేదనేది కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా తాజాగా దీపావళికి రిలీజ్ అయిన అన్ని మూవీస్ లో లక్కీ భాస్కర్ మూవీ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఓవరాల్ గా ఈ మూవీ ఎంతమేర రాబడుతుందో చూడాలి.