నేచురల్ స్టార్ నాని దసరా టీజర్ తన మాస్ అప్పీల్ మరియు పల్లెటూరి నేపథ్యంతో ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ చేసింది. ఇక టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకులు, ఇండస్ట్రీ జనాలతో పాటు దసరా ఒక యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని, ఆ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అనుకున్నారు.
అయితే ఈ సినిమాలో నాని – కీర్తి సురేష్ ల మధ్య అందమైన లవ్ ట్రాక్ ఉందని, ఆ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా అవుతాయని, నాని క్యారెక్టరైజేషన్ కూడా అసాధారణంగా ఉంటుందని, తన కెరీర్ లోనే ఐకానిక్ గా నిలుస్తుందని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. రొమాన్స్ ట్రాక్ అనేది నానికి చాలా అలవాటైన జానర్. ఇలా లవ్, యాక్షన్ మధ్య బ్యాలెన్స్ ను గనక దర్శకుడు బాగా హ్యాండిల్ చేస్తే దసరా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు.
ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇండస్ట్రీలో విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేస్తుండటంతో నిర్మాతలు ఇప్పటికే స్టార్ హీరోలకు శ్రీకాంత్ ఓదెల చాలా టాలెంటెడ్ అని, ఆయన దగ్గర కూడా అద్భుతమైన కథలు ఉన్నాయని చెబుతున్నారట.
హీరో నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన దసరా బడ్జెట్ 65 కోట్లకు పైగానే జరిగింది. కానీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఆ మొత్తాన్ని రికవరీ చేసిన నిర్మాత.. దాదాపు 10 కోట్ల లాభాలు ఆర్జించారని అంటున్నారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్, రాజశేఖర్ అనింగి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం దసరా. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.