చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన లవ్ టుడే సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుంది. యువత ఈ సినిమాని చూడటానికి థియేటర్ల వైపు పరుగులు పెడుతోంది. ఈ సినిమా తమిళంలో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా కూడా నటించారు.
కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల మార్కును చేరుకునే దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం రొమాంటిక్ కామెడీగా రూపొందించబడింది. కాగా ఇందులో సమకాలీన కథ, కథనాలతో యువతను ఆకర్షిస్తుంది.
ఈ సినిమాలోని కామెడీ మరియు సంగీతానికి విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. డైలాగులు, సంగీతం సరైన అనుభూతిని ఇవ్వడంతో ఈ సినిమా డబ్బింగ్ సినిమా లాగా కాకుండా స్ట్రెయిట్ తెలుగు సినిమా లాగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.
ఈ సినిమా తమిళంలో దాదాపు 80 కోట్లు వసూలు చేసింది. తెలుగులో 2.5 కోట్లకు అమ్ముడైంది, అయితే మొదటి రోజు లోనే అంతే మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల నుంచి వసూళ్లు కలుపుకుని ఫుల్ రన్‌లో 100 కోట్లు రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ తో పాటు (నటుడిగా తొలి చిత్రం), ఇవానా, రవీనా రవి, యోగి బాబు మరియు రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను యువన్ శంకర్ రాజా అందించారు, సినిమాటోగ్రఫీ దినేష్ పురుషోత్తమన్ మరియు ఎడిటింగ్ ప్రదీప్ ఇ. రాఘవ్ అందించారు.
“లవ్ టుడే” అనేది ఒక యువ జంట ప్రేమకథ. ఒకరి గురించి ఒకరు లోతుగా తెలుసుకోవడం కోసం ఒక రోజు వారి మొబైల్ ఫోన్‌లను మార్చుకుంటారు. ఇది వారి ప్రేమ జీవితంలో ఒక సమస్యగా మారుతుంది. సత్యరాజ్ మరియు రాధిక శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.