Homeసినిమా వార్తలుLokesh LCU was with Big Planning లోకేష్ కనకరాజ్ LCU : పెద్ద ప్లానింగే...

Lokesh LCU was with Big Planning లోకేష్ కనకరాజ్ LCU : పెద్ద ప్లానింగే ఉన్నట్లుంది

- Advertisement -

కోలీవుడ్ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి జోరుతో కొనసాగుతున్నారు. కార్తీతో ఆయన తీసిన ఖైదీ మూవీ అటు తమిళ్ తో పాటు అప్పట్లో తెలుగులో కూడా భారీ విజయం అందుకుంది. అనంతరం ఇళయదళపతి విజయ్ తో తీసిన మాస్టర్ తెలుగులో పర్వాలేదనిపించగా తమిళ్ లో బాగా సక్సెస్ అయింది. ఇక ఆపైన కమల్ తో తీసిన విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టగా ఇటీవల విజయ్ తో తెరకెక్కించిన లియో కూడా బాగానే ఆడింది.

అయితే తన LCU లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ వంటి సినిమాలు అన్నిటికీ కూడా లింక్స్ ఉండనున్నాయనేది తెలిసిందే. ఇక తాజాగా తన నెక్స్ట్ షార్ట్ ఫిలిం చాప్టర్ జీరో యొక్క 10 నిముషాల ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేసారు లోకేష్. దీనిని చూస్తుంటే ఇది LCU కి ప్రీక్వెల్ అనిపిస్తోంది. 1 షాట్, రెండు స్టోరీలు, 24 గంటలు అనే ఫాస్ట్ పేస్డ్ కాన్సెప్ట్ తో ఇది సాగనుంది. ఇక ఈ షార్ట్ ఫిలింలో అర్జున్ దాస్, నరైన్, కాళిదాస్ జయరాం తదితరులు కనిపించనుండగా టాప్ స్టార్స్ అయిన విజయ్, సూర్య, కమల్ వంటి వారు స్పెషల్ అఫియరెన్స్ ఇస్తారేమో చూడాలి.

అదే జరిగితే ఆ షార్ట్ ఫిలిం అదిరిపోనుంది. కాగా చాప్టర్ జీరో పలు కథనాలు, పాత్రల యొక్క ప్లాట్ లని బట్టి సాగనుంది. దీనిని బట్టి త్వరలో రూపొందనున్న LCU సినిమాల్లో లోకేష్ యొక్క ఆలోచనలు ఇంకెంత గ్రాండ్ గా ఉండనున్నాయో అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ వీడియోకి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

READ  Samantha Reaction on Konda Surekha Comments కొండాసురేఖ కామెంట్స్ పై సమంత పవర్ఫుల్ రియాక్షన్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories