కోలీవుడ్ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం కెరీర్ పరంగా మరింత జాగ్రత్త ప్లానింగ్ తో కొనసాగుతున్నారు. ఇటీవల తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కార్తీతో ఖైది అలానే విజయ్ తో లియో కమలహాసన్ తో విక్రమ్ సినిమాలు తెరకెక్కించి మంచి విజయాలని సొంతం చేసుకున్నారు లోకేష్ కనకరాజ్. ముఖ్యంగా ఆయన సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ఇక ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ మూవీ తెరకెక్కిస్తున్నారు లోకేష్ కానక రాజ్. దీని అనంతరం తన సినిమాటిక్ యూనివర్స్ లో మిగతా సినిమాలని వరుసగా చేసేందుకు సిద్ధమవుతున్నారు లోకేష్. అందులో భాగంగా ప్రస్తుతం లారెన్స్ తో తెరకెక్కుతున్న బెంజ్, ఆ తర్వాత కార్తీ తో ఖైదీ 2 అలానే ఆపైన సూర్యతో రోలెక్స్ ఇక చివరిగా విక్రమ్ 2 ఇలా వరుసగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలు రూపొందనున్నాయి.
కాగా విక్రమ్ 2 మూవీతో సినిమాటిక్ యూనివర్స్ కి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అయితే ఈ సినిమాలు అన్నిటిపై కూడా దేశవ్యాప్తంగా అన్ని భాష ల ఆడియన్స్ లో కూడా విశేషమైన క్రేజ్ ఉంది. మరి ఇవన్నీ తెరకెక్కిన తర్వాత ఏ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేసి లోకేష్ కి ఎంతమేర పేరు తీసుకొస్తాయో తెలియాలంటే మరికొన్నేళ్ల వరకు వెయిట్ చేయక తప్పదు