బాక్సాఫీస్ వద్ద లైగర్ దారుణమైన ఫలితం చవిచూసిన తర్వాత, పూరి జగన్నాథ్ మరియు ఛార్మీ కౌర్‌ల మధ్య సంబంధం చెడినట్లుగా తెలుస్తోంది. ఇక పై ఛార్మీ కౌర్‌తో కలిసి పని చేయడం జగన్‌కు ఇష్టం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రస్తుతం బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. తమకు బాగా నచ్చే, తాము బాగా మెచ్చే సినిమాలు మరియు కాన్సెప్ట్ లను స్వతంత్రంగా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో.. తమకంటూ ఒక హోమ్ బ్యానర్‌లో సినిమాలను నిర్మించాలనే ఆలోచనతో ఇద్దరూ కలిసి తమ ప్రొడక్షన్ హౌస్ పూరి కనెక్ట్స్‌ని స్థాపించారు.
అయితే ఇప్పుడు లైగర్ సినిమా అనూహ్యంగా భారీ డిజాస్టర్ గా నిలిచిన నేపథ్యంలో.. పూరి ఈ బ్యానర్ నుంచి విడిపోవాలనుకుంటున్నారని సమాచారం. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, పూరి ఇక పై సినిమాల నిర్మాణ వ్యవహారాలలో భాగం కావడానికి ఇష్టపడటం లేదట. కేవలం తన సినిమాల స్క్రిప్ట్ వర్క్ మరియు కథా విస్తరణ పై మాత్రమే పూరి దృష్టి పెట్టాలనుకుంటున్నారట. ప్రొడక్షన్ వర్క్ పనుల వల్ల తన టైం బాగా తగ్గిపోతూ.. దాని ప్రభావం స్క్రిప్ట్ వర్క్ పై పడుతున్నట్లు ఆయన భావిస్తున్నారు.
అయితే, ఛార్మీ కౌర్ మాత్రం ఇప్పటికీ పూరి కనెక్ట్స్‌ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. కాగా ఇటీవలే సోషల్ మీడియాలో.. పూరి కనెక్ట్స్‌ని మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నానని ఆవిడ పేర్కొన్నారు. కానీ దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం ఇక పై సినిమాలు నిర్మించే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఇదే గనక నిజం అయితే.. పూరి లేకుండా ఛార్మీ ప్రొడక్షన్ హౌస్‌ని కొనసాగిస్తారా లేక తను కూడా శాశ్వతంగా ప్రొడక్షన్ వర్క్ నుండి తప్పుకుంటారా అనేది చూడాలి.
ఇదిలా ఉండగా, లైగర్ భారీ పరాజయం మరియు దాని ఫలితం వల్ల మార్కెట్ లో తన ఇమేజ్ పై పడ్డ ప్రభావం కారణంగా పూరి జగన్నాథ్, ఎప్పటి నుంచో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించాలని అనుకుంటున్న జనగణమన సినిమా గందరగోళంలో పడింది. ఇప్పుడు జనగణమన సినిమా తీయాలంటే పూరికి బడ్జెట్ కు సరిపడా డబ్బు కావాలి.
ఆ రకంగా చూసుకుంటే పూరికి లైగర్ సినిమా తాలూకు నష్టాలు చాలవన్నట్లు ఇప్పుడు జనగణమన సినిమా విషయంలో ఒక అనిశ్చితి నెలకొంది. దానికి తోడు విజయ్ దేవరకొండ జనగణమన సినిమాని వదిలేసి తన పని తాను చూసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది, ఇల రకరకాల సమస్యలు చుట్టూ చేరి పూరిని కలవరపెడుతున్నాయి