Homeసినిమా వార్తలుభారీ అంచనాలను రేకెత్తిస్తున్న లైగర్ కొత్త పోస్టర్

భారీ అంచనాలను రేకెత్తిస్తున్న లైగర్ కొత్త పోస్టర్

- Advertisement -

యువ స్టార్ హీరో “రౌడీ” విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో “లెగర్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని బాలీవుడ్ భారీ నిర్మాత కరణ్ జోహార్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.

ఈ సినిమాకి సంభందించిన ప్రతి పబ్లిసిటీ మెటీరియల్ తోఅంచనాలను మరింత ఎక్కువగా పెంచుకుంటూ వెళ్తుంది.విజయ్ దేవరకొండ పాత్రను సూచించేలా ఉన్న సాలా క్రాస్‌బ్రీడ్ అనే ట్యాగ్‌లైన్ బోల్డ్‌గా మరియు ప్రభావవంతంగా కనిపిస్తుంది.

మునుపెన్నడూ లేని విధంగా సినిమాటిక్ అనుభూతిని అందజేస్తూ,ఒక  భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తయారవుతున్న లైగర్ తెరకెక్కుతోంది.


తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్  విడుదల చేసారు,  విజయ్ తన శరీర ధారుడ్యాన్ని ప్రదర్శిస్తూ కనిపించారు. ఇది ఒక హీరోగా నటుడుగా సినిమా కోసం ఏ స్థాయిలో అయినా కష్ట పడతారు అని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


MMA ఫైటర్‌గా విజయ్ మేక్ఓవర్ కు గురయ్యారు. అంతే కాకుండా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక శక్తివంతమైన పాత్రను పోషించారు.ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగాప్రత్యేక వీడియోను లైగర్ చిత్ర యూనిట్ విడుదల చేశారు.అందులో ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావంతో పాటు ఆయన చిత్ర బృందంతో సన్నిహితంగా గడిపిన విధానం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

READ  మహేష్ ను ఫాలో అవుతున్న బిల్ గేట్స్


ఇటీవల ముంబైలో విజయ్ దేవరకొండ – అనన్య పాండే పై ఒక పాటను రూపొందించిడంతో పాటుపబ్లిసిటీ పనులను మమ్మురం చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.


విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే మరియు గెటప్ శ్రీను వంటి భారీ తారాగణం కనిపించనున్న ఈ సినిమాని పూరీ కనెక్ట్స్‌తో కలిసి, బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  బండ్ల గణేష్ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన పూరి


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories