Home సినిమా వార్తలు లైగర్ సినిమాపై తప్పుడు ప్రచారం చేశారు – వరంగల్ శ్రీను

లైగర్ సినిమాపై తప్పుడు ప్రచారం చేశారు – వరంగల్ శ్రీను

Distributor Loses 100 Crores In One Year; Never Before In Indian Cinema

ఇటీవల విడుదలైన లైగర్ సినిమా దారుణంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిన తర్వాత, చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్నారు. 90 కోట్లకు పైగా లైగర్ సినిమా తాలూకు సౌత్ ఇండియా హక్కులను మొత్తంగా కొనుగోలు చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యుటర్ వరంగల్ శ్రీను ఈ సినిమా వల్ల విపరీతమైన నష్టాన్ని చవిచూశారు.

ఈ ఫలితం తరువాత లైగర్ సినిమా చిత్ర బృందం వ్యవహరించిన తీరుతో శీను కలత చెందారు. ఎందుకంటే 50 కోట్లకు పైగా నష్టం అంటే ఎవరికైనా పెద్ద విషయమే కదా. అయితే, వరంగల్ శ్రీను ఇటీవల లు చిత్రం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.క్లైమాక్స్ మినహా లైగర్ చాలా మంచి సినిమా అని వరంగల్ శ్రీను పేర్కొన్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి, ప్రేక్షకులు అలరించే అంశాలు ఉన్నాయి అని అన్నారాయన. కానీ చివరి సన్నివేశాలు మాత్రమే కాస్త నెగటివ్ అయ్యాయని అన్నారు. ఒక్క క్లైమాక్స్‌ మినహా సినిమాలోని మిగతా పోర్షన్‌లు ఆకట్టుకునెలా ఉన్నాయని అని అన్నారు వరంగల్ శ్రీను.

ఇక లైగర్ వైఫల్యానికి ప్రేక్షకులదే తప్పు అనేలా వరంగల్ శ్రీను మాట్లాడారు. చాలా మంది ప్రజలు సినిమాని చూడకుండానే నెగిటివ్ రివ్యూలను, టాక్ ను ప్రచారం చేస్తున్నారని శ్రీను తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటనలు ప్రేక్షకులను షాక్‌కి గురిచేశాయి. సినిమా ఫ్లాప్ అయితే ప్రేక్షకులను నిందించటం ఏంటని పలువురు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అందులోనూ లైగర్ సినిమాకు కనీసం ఏ ఒక్క వర్గం ప్రేక్షకులు కూడా పరవాలేదు అని కూడా టాక్ చెప్పలేదు. అంత దారుణంగా ఉన్న సినిమా వైఫల్యానికి ప్రేక్షకులని కారణంగా చూపడం ఏమాత్రం సరి కాదు.

వరంగల్‌ శ్రీనుకు లైగర్ సినిమా వల్ల భారీ నష్టాలను చూసి ఉండవచ్చు. అయితే దానికి ప్రేక్షకులను తప్పు పట్టడంతో ఆయన వ్యాఖ్యల పై వారు తిరగబడుతున్నారు. మెజారిటీ ప్రజలు లైగర్ చిత్రం బాగాలేదు అని నిర్ధారించిన తరువాత, సినిమా రన్ కూడా పూర్తయిపోయిన తరువాత ఇలాంటి అనవసరమైన డ్యామేజ్ కంట్రోల్ పనులు అవసరం లేదని ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version