Homeసినిమా వార్తలులైగర్ ఫెయిల్ అయినా తగ్గని విజయ్ దేవరకొండ యాటిట్యూడ్

లైగర్ ఫెయిల్ అయినా తగ్గని విజయ్ దేవరకొండ యాటిట్యూడ్

- Advertisement -

విజయ్ దేవరకొండ తన కెరీర్‌లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్‌ను లైగర్‌తో చవి చూశారు. భారత దేశం అంతటా భారీ స్థాయిలో ప్రచారం జరిపి ఎంతో గొప్ప సినిమా అని చెప్పుకోగా.. తీరా విడుదలైన తర్వాత ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే లైగర్ పరాజయం విజయ్ ప్రయాణాన్ని అతని ఆత్మ విశ్వాసాన్ని మాత్రం ప్రభావించలేకపోయింది. ఫలితం ఏదైనా సరే ఈ లైగర్ గర్జన ఆగదు అంటున్నారు విజయ్ దేవరకొండ.

సాధారణంగా స్టార్ హీరోలు సినిమాలు ఫ్లాప్ అయినపుడు మీడియాకు దూరంగా ఉంటారు. మరియు వైఫల్యం తర్వాత వీలయినంత వరకూ సౌమ్యంగా ఉంటారు. ఇక కొందరు ఐతే విదేశాలకు వెళ్లి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. తమ సినిమాలు ఫ్లాప్ అయితే రోజుల తరబడి బయటకు రాలేమని మహేష్ బాబు, రామ్ చరణ్ గతంలో మీడియాతో చెప్పారు.

అయితే ఇతరులకు భిన్నంగా విజయ్ దేవరకొండ ఎప్పుడూ ఆఫ్‌స్క్రీన్‌ తనదైన ప్రత్యేక వైఖరిని కలిగి ఉంటారు. అలాంటి మనస్తత్వం మరియు ప్రవర్తన అతనికి అభిమానులతో పాటు ద్వేషించేవారిని కూడా తీసుకువచ్చింది. ఈ నిర్భయ వైఖరి మెచ్చుకోదగ్గదే అని అభిమానులు భావిస్తుంటే.. ఆ ప్రవర్తన అతి అని విజయ్ మరీ ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటారని మరి కొందరు భావిస్తున్నారు.

READ  నిరాశ పరచిన సర్కారు వారి పాట టీఆర్పీ రేటింగ్స్

తాజాగా ఓ మీడియా సమావేశంలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రకారం, అతని పునరాగమనం గురించి చాలా మంది అతనిని అడిగారు. అయితే విజయ్ అందుకే తనదైన శైలిలో వారికి ప్రతిస్పందించారు. అసలు కమ్ బ్యాక్ అంటున్నారు.. నేను ఎక్కడికి వెళ్ళలేదు.. ఇక్కడే ఉన్నాను అమి అన్నారు. మొత్తంగా తాను కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన అవకాశం కూడా తలెత్తదని చెప్పారు.

పైన చెప్పినట్లుగా, ఈ ప్రకటన మరియు విజయ్ మాటల్లోని ఆత్మ విశ్వాడం అతని అభిమానులచే ఆనందించబడింది. అయితే ఎన్ని దెబ్బలు తిన్నారు కూడా ఇంకా విజయ్ దేవరకొండ ఇప్పటికీ మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోలేదని ఒక వర్గం ప్రేకకులు అంటున్నారు. విజయ్ వీలయితే ముందు ఒక హిట్ కొట్టి ఆ తర్వాత మాట్లాడాలి అని వారు అభిప్రాయ పడ్డారు.

ఈ విలక్షణమైన, దూకుడు గల వైఖరిని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా మెచ్చుకున్నారు. అయినప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్, చరణ్ మొదలైన వినయపూర్వకమైన స్వభావం ఉన్న తారలతో పోల్చితే హిందీ ప్రేక్షకులు. విజయ్ వైఖరిని ఇష్టపడకపోయి ఉండవచ్చని కూడా ఆయన భావించారు.

లైగర్ ఫ్లాప్ కావడానికి కూడా ఇదే కారణమని రామ్ గోపాల్ వర్మ భావించారు. కానీ తమ సినిమాల బాక్సాఫీస్ పనితీరుతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు ఎప్పుడూ నమ్మకంగా ఉండటం ఎల్లప్పుడూ మంచిదనే చెప్పాలి.

READ  మిశ్రమ స్పందన తెచ్చుకున్న ప్రభాస్ ఆదిపురుష్ ఫస్ట్ లుక్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories